ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘జన నాయగన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎందులో అంటే..??

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘జన నాయగన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎందులో అంటే..??

Published on Aug 17, 2026 5:00 PM IST

Jana-nayagan

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన ‘జన నాయగన్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా కంటెంట్ పరంగా అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లను సాధించింది. నెగిటివ్ రివ్యూలు, పూర్ వర్డ్ ఆఫ్ మౌత్ మరియు పైరసీ లీక్స్ ఉన్నప్పటికీ, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచి తమిళనాడులో విజయ్ మాస్‌ను మరోసారి నిరూపించింది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’, ‘జననాయగన్’ చిత్రాన్ని ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇతర భారతీయ భాషల్లోనూ ఒకేసారి డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి కీలక పాత్రలు పోషించగా, అనిరుధ్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు