జన నాయగన్ సరికొత్త రికార్డు..!

జన నాయగన్ సరికొత్త రికార్డు..!

Published on Sep 5, 2026 1:00 AM IST

తలపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ ఓటీటీ వేదికగా జీ5 లో అద్భుతమైన ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. ఆగస్టు 21న డిజిటల్ ప్రీమియర్‌గా విడుదలైన ఈ చిత్రం, ఇప్పటివరకు 34 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించి ప్లాట్‌ఫారమ్‌లో అత్యధికంగా వీక్షించిన సౌత్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. థియేట్రికల్ విడుదలకు ముందు సెన్సార్ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, విజయ్ కెరీర్‌లో ఇదే చివరి చిత్రం కావడంతో అభిమానులు ఓటీటీలో దీనిని విపరీతంగా వీక్షిస్తున్నారు.

హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం, థియేటర్లలో చూడలేకపోయిన వారితో పాటు మళ్లీ మళ్లీ చూడాలనుకునే అభిమానులను ఓటీటీ వైపు విజయవంతంగా ఆకర్షిస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు