విడుదల తేదీ : సెప్టెంబర్ 4, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : పంకజ్ త్రిపాఠీ, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, అభిషేక్ బెనర్జీ, రవి కిషన్ తదితరులు
దర్శకత్వం : గుర్మీత్ సింగ్
సంగీతం :జాన్ స్టీవర్ట్ ఎడూరి
నిర్మాతలు : రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్
ఛాయాగ్రహణం : సంజయ్ కపూర్
కూర్పు : మనన్ అశ్విన్ మెహతా
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఇండియన్ ఓటీటీ సెన్సేషనల్ సిరీస్ మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ పై సినిమాగా ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి మంచి బజ్ సెట్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ సినిమాని మేకర్స్ హిందీ, తెలుగు భాషల్లో విడుదలకి ప్లాన్ చేశారు. మరి నేడు థియేటర్స్ లో విడుదలకి వచ్చిన ఈ బోల్డ్ యాక్షన్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
అఖండానంద్ త్రిపాఠీ అలియాస్ ఖాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠీ) మిర్జాపూర్ రాజు. అతను తన కొడుకు ఫూల్ చంద్ త్రిపాఠీ అలియాస్ మున్నా భయ్యా (దివ్యేందు)ను అతని నడవడిక చూసి అంత నమ్మకం పెట్టుకోడు. సో దీనితో తన సామ్రాజ్యాన్ని చూసుకునే బాధ్యతను ఇద్దరు బ్రదర్స్ గుడ్డు పండిట్ (అలీ ఫజల్), బబ్లూ పండిట్ (జితేంద్ర కుమార్)లకు అప్పగిస్తాడు. అందువల్ల, మున్నా భయ్యాకు గుడ్డు, బబ్లూలంటే ఇష్టం ఉండదు. కానీ, జైసల్మేర్‌కు చెందిన వ్యాపారవేత్త, ఉమ్మడి శత్రువైన బబ్బన్ యాదవ్ (రవి కిషన్) రాకతో, మీర్జాపూర్ లో పరిస్థితులు రాజకీయ సమీకరణాలు మారుతాయి. సో ఈ బబ్బన్ యాదవ్ వచ్చి ఏం చేశాడు? అతన్ని వీరు ఎలా ఎదుర్కొన్నారు? మున్నా భయ్యా పండిట్ బ్రదర్స్ విషయంలో ఏం చేశాడు? ఆఖరికి మీర్జాపూర్ రాజుగా ఎవరు నిలిచారు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
సిరీస్ గా మంచి క్రేజ్ ఉన్నప్పటికీ దీన్ని సినిమాగా ఎలా వర్కవుట్ చేస్తారు? బిగ్ స్క్రీన్ పై పనవుతుందా అనే ప్రశ్నలకు మేకర్స్ సాలిడ్ ఆన్సర్ అందించారు. ఇందులో కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సిరీస్‌ను బిగ్ స్క్రీన్‌పైకి చాలా అద్భుతంగా మలిచారాలని చెప్పొచ్చు. సిరీస్ యొక్క అసలు థీమ్ ని ఎక్కడా చెడగొట్టకుండా నీట్ గా హ్యాండిల్ చేస్తూ, బిగ్ స్క్రీన్ అనుభవానికి అవసరమైన అంశాలను కూడా మేకర్స్ దీనికి జోడించారు.
డైలాగ్స్ మరియు హ్యూమర్ ఎప్పుడూ మిర్జాపూర్ సిరీస్‌కు అతిపెద్ద బలం. ఈ చిత్రం ఆ విషయాల్లో కూడా అద్భుతంగా రాణించి, సంభాషణలను ఆసక్తికరంగా మార్చింది. ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం థియేటర్స్ లో గూస్బంప్స్ తెప్పించడం గ్యారెంటీ. అలానే కీలక పాత్రల నడుమ ఫేస్-ఆఫ్ సన్నివేశాలు అద్భుతంగా డిజైన్ చేశారు. పలు యాక్షన్ సీక్వెన్స్‌లు, మాస్ ప్రేక్షకులకు ఫీస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాగే ఇందులో నడిచే పవర్ గేమ్ కూడా మంచి ఇంటెన్స్ మోడ్ లో కొనసాగుతూ ఇంప్రెస్ చేస్తుంది. అలాగే చివరలో పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా బాగున్నాయి. ఒక వెబ్ షోను వెండితెరకు ఎక్కించడం నిజంగా పెద్ద ప్రయోగమే, ఓటీటీలో హిట్ అయినంత మాత్రాన అది బిగ్ స్క్రీన్ పై వర్క్ అవుతుంది అని చెప్పలేం. కానీ అలా హిట్ అయ్యేందుకు కావాల్సిన పర్ఫెప్ట్ సెటప్ ని ఈ సినిమా యూనిట్ సెట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.
వెర్సటైల్ నటుడు పంకజ్ త్రిపాఠీ సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన సెటిల్డ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ నటన మనల్ని కట్టిపడేస్తుంది. అలీ ఫజల్ కీలకమైన యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. అలాగే అందరి ఫేవరెట్ మున్నా భయ్యాగా దివ్యేందు అద్భుతమైన నటన కనబరిచాడు. అతని ఆటిట్యూడ్, స్వాగ్, డైలాగ్ డెలివరీ థియేటర్లలో ఈలలు వేయిస్తాయి. బబ్లూ పండిట్‌గా విక్రాంత్ మస్సే స్థానంలో జితేంద్ర కుమార్ వచ్చి చక్కటి న్యాయం చేశాడు. ప్రధాన విలన్‌గా రవి కిషన్ సాలిడ్ విలనిజాన్ని ప్రదర్శించారు. సోనాల్ చౌహాన్ అవసరమైన గ్లామర్‌ను అందించింది. అభిషేక్ బెనర్జీ, షాజీ చౌదరి, షీబా చద్దా, రసిక దుగల్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా కథనం మొదట్లో కాస్త నెమ్మదిగా మొదలవుతుంది, పరిస్థితిలు సెట్ చేయడానికి కొంచెం సమయం తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని నెమ్మదైన సన్నివేశాలు ఉన్నాయి, ఎడిటింగ్ టీమ్ ఇంకాస్త బెటర్‌గా పని చేసి ఉండాల్సింది. అలాగే ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ మహిళా నటులకు స్కోప్, స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండటం. శ్రియా పిల్గావ్కర్, శ్వేతా త్రిపాఠీ, హర్షితా గౌర్ పాత్రలు చాలా వరకు బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం అయ్యాయి. సిరీస్ లో మహిళా నటులు, పాత్రల్లో మంచి ప్రాధాన్యత కనిపించింది కానీ ఇందులో మాత్రం ఆ కేర్ మిస్ అయ్యింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో కూడా నిర్మాణ విలువలు ఫస్ట్ క్లాస్ లో ఉన్నాయి. జాన్ స్టీవర్ట్ ఎడూరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. అనేక సన్నివేశాలు ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎలివేట్ అయ్యాయి. సంజయ్ కపూర్ సినిమాటోగ్రఫీ స్టన్నింగ్ గా ఉంది, తన కెమెరా వర్క్‌తో సినిమాకి మంచి సినిమాటిక్ ఫీల్ తీసుకొచ్చాడు. అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ చాలా స్టైలిష్‌గా ఉంది. ఫస్టాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది. టెక్నికల్ గా మరో బిగ్ ప్లస్ తెలుగు డబ్బింగ్ అని చెప్పొచ్చు. సిరీస్ హిట్ ఫాక్టర్ లో తీసుకున్న తెలుగు డబ్బింగ్ క్వాలిటీనే ఇక్కడా మైంటైన్ చేయడం మంచి విషయం.
ఇక దర్శకుడు గుర్మీత్ సింగ్ విషయానికి వస్తే, మీర్జాపూర్: ది మూవీతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ని తను సాలిడ్ గా డిజైన్ చేసి హ్యాండిల్ చేశారు. ఉంటుంది. కార్ రేస్ సీన్, రవి కిషన్‌ను పంకజ్ త్రిపాఠీ గ్యాంగ్ ఎదుర్కోవడం వంటి ఎపిసోడ్స్, మరియు పోస్ట్-క్రెడిట్ సీన్స్ సినిమాలో హైలైట్ గా తను తీర్చి దిద్దారు.
తీర్పు:
ఇక మొత్తానికి, మీర్జాపూర్: ది మూవీ అనేది ఓ ఇంటెన్స్ బోల్డ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో అభిమానించే మీర్జాపూర్ ప్రపంచాన్ని బిగ్ స్క్రీన్‌పైకి మేకర్స్ సాలిడ్ గా వర్కవుట్ చేశారు. ప్రధాన నటీనటుల బలమైన నటన, పవర్ఫుల్ డైలాగ్స్, హ్యూమర్, ఇంటెన్స్ ఫేస్-ఆఫ్ సీక్వెన్స్ లు అలాగే థియేట్రికల్ మూమెంట్స్‌తో నిండిన మాస్ సెకండ్ హాఫ్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలెట్ గా నిలిచాయి. ఫస్టాఫ్ లో కొంచెం స్లో కథనం, కొన్ని పాత్రలని వీక్ గా వదిలేయడం కొంచెం డిజప్పాయింట్ చేస్తాయి. ఇవి పక్కన పెడితే మీర్జాపూర్ సినిమా సాలిడ్ ట్రీట్ అందిస్తుంది, వాచ్ ఇట్.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team


