తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా కష్టాలు రోజుకింత పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాకు సెన్సార్ కష్టాలు మొదలుకొని, రీసెంట్గా పైరసీ బారిన పడటం వరకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో ప్రత్యక్షం కావడంతో మేకర్స్ తల పట్టుకుంటున్నారు. పైరసీని అడ్డుకునేందుకు వారు తగిన చర్యలు చేపడుతున్నారు.
అయితే, ఇలాంటి సమయంలో ‘జన నాయగన్’ చిత్రం ఏకంగా టీవీ ఛానల్లో ప్రత్యక్షం కావడంతో అందరూ అవాక్కయ్యారు. కోయంబత్తూరులోని ‘రాశి ప్రైమ్ మూవీ’ అనే లోకల్ కేబుల్ ఛానల్లో ‘జన నాయగన్’ పైరసీ చిత్రాన్ని ప్రసారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు మరియు టీవీకే శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే సినిమా రిలీజ్ కాకుండా వాయిదా పడుతుండటం, ఆన్లైన్లో పైరసీ బారిన పడటం వంటి కష్టాల్లో మునిగిన మేకర్స్‌కు ఇప్పుడు ఇలా ఓ లోకల్ ఛానల్లో సినిమా ప్రత్యక్షం కావడం మరింత తలనొప్పి తెచ్చిపెట్టింది. మరి ఈ చిత్రం ఇన్ని సమస్యల నుంచి ఎప్పుడు విముక్తి పొందుతుందా.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని విజయ్ ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు.
