తన రికార్డును తానే బ్రేక్ చేసిన విజయ్

Jana-nayagan

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ 2026 జనవరి 9న పొంగల్ కానుకగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా, బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

అయితే ఈ చిత్రానికి సంబంధించి యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, జన నాయగన్ 24 గంటల్లోనే 12.7 వేలకుపైగా టికెట్లు అమ్ముడై, తమిళ సినీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్‌ను సృష్టించింది. విశేషమేమిటంటే, ఈ రికార్డు గతంలో విజయ్ నటించిన లియో పేరిట ఉండేది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో 24 గంటల్లో 10 వేల టికెట్లు అమ్మగా, ఇప్పుడు జన నాయగన్ దానిని అధిగమించింది.

ఈ బలమైన ఓపెనింగ్ ట్రెండ్, ప్రేక్షకులు విజయ్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలను ఇస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరైన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version