“దేవర” పై జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్.!

“దేవర” పై జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్.!

Published on Feb 22, 2024 5:14 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న చిత్రం “దేవర” కూడా ఒకటి. మరి ఈ చిత్రం తోనే బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తంగం గా నటిస్తున్న జాన్వీ కపూర్ ఈ సినిమాపై చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

మరి ఆమె లేటెస్ట్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను ఎన్టీఆర్ తో ఇంకా సినిమా షూటింగ్ చేస్తున్నాను అని కొన్ని పాటలు కూడా బాలన్స్ ఉన్నాయి. షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించింది. అలాగే ఆమె ఈ సినిమా పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్టుగా కూడా తెలిపింది. దీనితో ఇపుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ కి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు