పెళ్లి పుకార్లపై జాన్వీ కపూర్ క్లారిటీ

పెళ్లి పుకార్లపై జాన్వీ కపూర్ క్లారిటీ

Published on May 29, 2024 11:33 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఐతే, జాన్వీకపూర్‌ ప్రస్తుతం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ చిత్రం మే31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐతే, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన పెళ్లిపై వచ్చిన రూమర్స్‌కు చెక్‌ పెట్టింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ‘ఇటీవల నా పెళ్లికి సంబంధించిన వార్తలు ఎక్కువ అయిపోయాయి. త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు రాస్తున్నారు. అసలు నాకు తెలియకుండానే వారంలో నాకు పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. నేను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను, పెళ్లి పై కాదు’ అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

అన్నట్టు గత కొంతకాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే మనవడు శిఖర్‌తో జాన్వీ కపూర్ డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే… ఎన్టీఆర్ దేవర సినిమాతో పాటు చరణ్ సినిమాలోనూ జాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు