‘దఢక్’ చిత్రం తో బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది అలనాటి అందాలతార స్టార్ హీరోయిన్ శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ఆమె నటించిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకుంది .
ఇక ఈచిత్రం మంచి కలెక్షన్స్ తో పాటు జాన్వీ కి అవార్డు ను కూడా తెచ్చిపెట్టింది. ప్రముఖ మ్యాగజైన్ వోగ్ ఈ ఏడాదికి గాను ఫ్రెష్ పేస్ అవార్డును ఆమెకు అందజేసింది. శ్రీదేవి బ్రతికి ఉంటే ఇలా జాన్వీ మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ప్రశంసల తో పాటు అవార్డులను కూడా సాదిస్తుండడం చూసి చాలా సంతోషించేదే.


