కన్ఫర్మ్…రామ్ చరణ్ నెక్స్ట్ కి జాన్వీ కపూర్ ఫిక్స్!

కన్ఫర్మ్…రామ్ చరణ్ నెక్స్ట్ కి జాన్వీ కపూర్ ఫిక్స్!

Published on Feb 19, 2024 11:35 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి గేమ్ చేంజర్ లో కనిపించనున్నారు. ఈ చిత్రం తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన తో ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ చేస్తున్నారు చరణ్. ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన తొలి రోజు నుండే అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం పై బాలీవుడ్ లో కూడా మంచి బజ్ నెలకొంది. ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది అంటూ ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.

తాజాగా వీటిపై ఒక క్లారిటీ వచ్చింది. ప్రముఖ ప్రొడ్యూసర్, జాన్వీ కపూర్ తండ్రి బోని కపూర్ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ కోసం త్వరలో జాయిన్ అవ్వనున్నట్లు ఇటీవల మీడియా తో పేర్కొన్నారు. ఈ న్యూస్ ఇప్పుడు కన్ఫర్మ్ అవ్వడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కి నేషనల్ వైడ్ ఉన్న క్రేజ్, జాన్వీ కపూర్ కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ తో సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు