పెద్ది ప్రమోషన్స్ కు దూరంగా జాన్వీ కపూర్.. కారణం అదేనా..?

Janvi-Kapoor-Peddi

శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్, బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె హిందీ కంటే తెలుగు ప్రాజెక్టులపైనే ఎక్కువ మొగ్గు చూపుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ గ్రామీణ యువతిగా కనిపించనుంది.

అయితే, ఈ భారీ పాన్-ఇండియా చిత్రం ప్రమోషన్లకు జాన్వీ దూరంగా ఉండబోతోందని వస్తున్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

​కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని, సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ఆమె ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఒక ప్రముఖ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఆమెకు ఉంది.

​ప్రస్తుతం జాన్వీ చేతిలో చెప్పుకోదగ్గ పెద్ద ఆఫర్లు లేని తరుణంలో, ‘పెద్ది’ విజయం ఆమెకు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుంది. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడం జాన్వీ చేసే పెద్ద పొరపాటే అవుతుంది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, జాన్వీ తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రమోషన్లలో భాగస్వామి కావాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version