ఓటిటి లోకి వచ్చేసిన “జపాన్”

ఓటిటి లోకి వచ్చేసిన “జపాన్”

Published on Dec 11, 2023 11:00 AM IST

కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ జపాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రానికి రాజా మురుగన్ దర్శకత్వం వహించగా, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో పాటుగా తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది.

ఈ చిత్రం థియేట్రికల్ విడుదలైన ఒక నెల తర్వాత ఓటిటి లోకి వచ్చింది. ప్రస్తుతం హిందీ వెర్షన్‌పై క్లారిటీ లేదు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మించారు. సునీల్, విజయ్ మిల్టన్, కేఎస్ రవికుమార్, సనల్ అమన్, వాగై చంద్రశేఖర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు