‘జాతి రత్నాలు’ వన్ మిలియన్ మార్క్ !

Published on Mar 22, 2021 1:00 pm IST

నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణలు మరో కీలక పాత్రల్లో నటించిన “జాతి రత్నాలు” బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రం యుఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా గొప్పగా కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. మేకర్స్ కొన్ని మంచి ప్రమోషన్లు బాగా చేస్తున్నందున, ఈ చిత్రం ఈ రోజు ఒక మిలియన్ మార్కుకు చేరుకోబోతుంది.

సాయంత్రం వచ్చే కలెక్షన్స్ తో వన్ మిలియన్ మార్క్ ను రీచ్ అవుతుంది. కాగా మేకర్స్ ఇప్పటికే భారీ లాభాలలో ఉన్నారు. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పటికే అనేక ప్రముఖుల నుంచి నవీన్ కు ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :