గతంలో తెలుగు రాష్ట్రాల మార్కెట్ తో పాటు యూఎస్ మార్కెట్ మీద కూడ అంతే శ్రద్ద ఉండేది. అక్కడ చిన్న సినిమా మిలియన్ డాలర్ వసూలు చేసింది అంటే హిట్ అనే ప్రామాణికం ఉండేది. కానీ లాక్ డౌన్ మూలంగా ఆ మార్కెట్ క్రాష్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు పూర్తిగా తెరుచుకుని వరుసగా సినిమాలు రిలీజవుతున్న అమెరికాలో మాత్రం అంతంతమాత్రంగానే ఉండేది పరిస్థితి. ‘క్రాక్, ఉప్పెన’ లాంటి సినిమాలు ఇక్కడ రికార్డ్ స్థాయి వసూళ్లను అందుకున్న అమెరికాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
కానీ ‘జాతిరత్నాలు’ చిత్రం మాత్రం ఆ పరిస్థితిని మార్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే వసూళ్లను రాబడుతోందో అమెరికాలో కూడ అదే స్థాయిలో దూసుకుపోతోంది. గురువారం నాటికి సినిమా మిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. 1,001,825 డాలర్లతో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. లాక్ డౌన్ తర్వాత మొదటి మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇక్కడితో సినిమా రన్ పూర్తికాలేదు. ఇప్పటికీ వసూళ్లు బాగానే ఉన్నాయి. గురువారం కూడ 5,066 డాలర్లను ఖాతాలో వేసుకుంది.
