ఈ ఏడాది విడుదలైన సూపర్ హిట్ సినిమాల్లో ‘జాతిరత్నాలు’ కూడ ఒకటి. వైజయంతి మూవీ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా దాదాపు 40 కోట్లకు పైనే వయసోళ్లను రాబట్టింది. ఈ సినిమాతో డైరెక్టర్ అనుదీప్ పేరు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది. ప్రతి సన్నివేశంలోనూ కామెడీని జనరేట్ చేయగల దర్శకుడనే పేరు వచ్చింది ఆయనకు. తమ బ్యానర్లో ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకుగాను అతనితో ఇంకొక సినిమా చేయాలని వైజయంతి నిర్మాతలు డిసైడ్ అయ్యారు.
ఈసారి కూడ అనుదీప్ కామెడీ ఎంటర్టైనర్ సినిమానే చేస్తాడని తెలుస్తోంది. ‘జాతిరత్నాలు’ చిత్రంలో ఎలాగైతే ముగ్గురు కుర్రాళ్ళు జోగిపేట నుండి హైదరాబాద్ వచ్చి మర్డర్ కేసులో ఇరుక్కుని నానా ఇబ్బందులు పడతారో అలాగే తర్వాతి కథలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ప్రయత్నంలో సాగే ఒక కామెడీ స్క్రిప్ట్ రాసుకున్నాడట. దాన్నే వైజయంతీ బ్యానర్లో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
