మరోసారి సీఎంగా నటించనున్న ప్రకాష్ రాజ్ ?

మరోసారి సీఎంగా నటించనున్న ప్రకాష్ రాజ్ ?

Published on Sep 4, 2019 1:00 PM IST

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’
అనే టైటిల్ తో బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. అలాగే ఈ బయోపిక్ లోనే మరో కీలకమైన పాత్ర అయిన ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటిస్తున్నాడు. అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకూ కరుణానిధి పాత్రలో మురళీ శర్మ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం ప్రకాష్ రాజ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గతంలో ప్రకాష్ రాజ్ దళపతి మూవీలో సీఎం కరుణానిధి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఇక విజయేంద్ర ప్రసాద్ కథ రాసే ముందే జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా కథలో హైలెట్ చేస్తూ కథ రాశారట. ముఖ్యంగా ఒక హీరోయిన్ని ఒక రాష్ట్రం మొత్తం అమ్మగా భావించడానికి గల కారణాలు ఏమిటి అన్న పాయింట్ ని ప్రధానంగా తీసుకోని కొత్త కోణంలో ఈ కథ రాశారట. ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు