9రకాల గెటప్ లలో కనిపించనున్న తమిళ హీరో !

Published on May 3, 2019 9:00 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ,కాజల్ జంటగా కోమలి అనే చిత్రం తెరకెక్కుతుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జయం రవి 9రకాల గెటప్ లలో కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి మేజర్ పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.

నూతన దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ కిరాక్ పార్టీ ఫేమ్ సంయుక్త హెగ్డే , సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ , యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :

More