జయం రవి ఇటీవలె ‘టిక్ టిక్ టిక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మంచి చిత్రంగా ‘టిక్ టిక్ టిక్’ చిత్రానికి మంచి పేరే వచ్చింది. ఎప్పుడు వైవిధ్యమైన చిత్రాల్లో నటించాలని కోరుకున్నే తమిళ హీరోల్లో జయం రవి పేరు కూడా ప్రముఖంగా విపిస్తోంది. ఐతే జయం రవి పోలీస్ పాత్రలో చాలా ఫేమస్. ఆయన ‘తని ఒరువన్’ (తెలుగులో ధృవ) ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఆయన మళ్ళీ పోలీస్ గా కనిపించనున్నారు.
నూతన దర్శకుడు కార్తిక్ దర్శకత్వంలో జయం రవి హీరోగా రూపొందిస్తున్న ‘అడంగామరు’ చిత్రంలో నటిస్తున్నారు. ‘తని ఒరువన్’ తో పాటు ‘బోగన్’ చిత్రంలో కూడా పోలీసుగా నటించిన జయం రవి ఇప్పుడు మళ్లీ ఖాకీ దుస్తులు వేసుకోనున్నారు. అయితే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా జయం రవి బరువు కూడా తగ్గారట. కాగా ఈ చిత్రం తెలుగులో డబ్ అవుతుందని సమాచారం. మరి ఈ సారి అయిన జయం రవికి తెలుగులో భారీ విజయం దక్కుతుందేమో చూడాలి.


