మంచు మనోజ్ ఎంటర్టైనర్ లో ‘జయం’ రవి వెరీ స్పెషల్ రోల్?

మంచు మనోజ్ ఎంటర్టైనర్ లో ‘జయం’ రవి వెరీ స్పెషల్ రోల్?

Published on Aug 5, 2026 1:00 AM IST

రీసెంట్ గా మిరాయ్ సినిమాతో నటుడిగా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన మంచు వారి హీరో మంచు మనోజ్ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో హీరోగా చేస్తున్న పలు సినిమాలపై కూడా మంచి బజ్ నెలకొంది. ఇలా తాను చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో యాక్షన్ ప్రాజెక్ట్ డేవిడ్ రెడ్డి, దీనికి పూర్తిగా భిన్నంగా చేస్తున్న ఎంటర్టైనర్ చిత్రం ‘వడ్డీ కాసుల వాడ’ కూడా ఒకటి.

దర్శకుడు తేజ్ ఉప్పలపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ ప్రముఖ నటుడు జయం రవి ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. అది కూడా జయం రవి ఇందులో సాక్ష్యాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో కనిపించనున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్టు టాక్. ఇది గాని నిజం అయితే సినిమాకి మంచి బూస్టప్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

తాజా వార్తలు