‘ప్యారడైజ్’ నుంచి అవైటెడ్ సాంగ్ రిలీజ్ అప్పుడే?

‘ప్యారడైజ్’ నుంచి అవైటెడ్ సాంగ్ రిలీజ్ అప్పుడే?

Published on Aug 5, 2026 1:10 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ భారీ చిత్రం షూట్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంటుంది. రీసెంట్ గానే సినిమా తాలూకా స్పెషల్ ఐటెం సాంగ్ ని స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పై పూర్తి చేసినట్టుగా బజ్ వినిపించింది. పైగా సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సాంగ్ ని దుమ్ము దులిపేసాడు అనే టాక్ కూడా సినీ వర్గాల్లో ఉంది.

ఈ నేపథ్యంలో ఈ సాంగ్ రిలీజ్ ఎప్పుడు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం
ఆగష్టు మూడో వారం లోనే ఈ క్రేజీ నెంబర్ ని విడుదల చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటించగా మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు తదితరులు నటిస్తున్నారు. అలాగే రేపు ఈ సినిమా తాలూకా టీజర్ గ్రాండ్ గా విడుదల కానుంది.

తాజా వార్తలు