సీనియర్ హీరో సినిమాలో జయప్రద ?

Published on Sep 27, 2020 3:00 am IST


నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రానున్న సినిమాలో సీనియర్ హీరోయిన్ జయప్రద నటించబోతుందని తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సినిమాలో సీనియర్ బాలయ్యకు భార్య పాత్ర ఉందని.. ఈ పాత్రలో జయప్రద తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కేవలం రెండు సీన్స్ లో మాత్రమే ఉంటాడని.. ఆ క్యారెక్టర్ జోడీగా ప్లాష్ బ్యాక్ లో జయప్రద కనిపిస్తుందని.. ఆ తరువాత సినిమాలో చాలా భాగం ఓల్డ్ గెటప్ లోనే కనిపిస్తుందని తెలుస్తోంది. కాగా బోయపాటి, ఈ పాత్ర గురించి జయప్రదకు వివరించాడని.. కాస్త రెండు లుక్స్ లో కనిపించాల్సి ఉంటుంది అని చెప్పగా.. జయప్రద కూడా చేస్తాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి జయప్రద, బాలయ్య సినిమాలో ఏ లుక్స్ లో కనిపించబోతుందో చూడాలి.

ఇక బాలయ్య యంగ్ క్యారెక్టర్ కి హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఇంకా హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే కరోనాకి ముందు ఈ మూవీకి సంబంధించిన ఒక యాక్షన్ షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేశారు. కరోనా అనంతరం జరిగే షూట్ లో కూడా హీరోయిన్ పార్ట్ కు సంబంధించిన సీన్స్ ను లేకుండా బోయపాటి షూట్ ప్లాన్ చేస్తున్నాడట. ఏమైనా బాలయ్యకి హీరోయిన్ సమస్య ప్రతి సినిమాకి ఉంటూ వస్తోంది. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More