ఓవర్సీస్ లో సత్తాచాటుతున్న జెర్సీ !

Published on Apr 21, 2019 6:06 pm IST

నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ మొన్న విడుదలై పాజిటివ్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లో హౌజ్ ఫుల్ కల్లెక్షన్స్ తో బ్లాక్ బ్లాస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా అదరగొడుతుంది. ప్రీమియర్స్ షోస్ తో బాక్సాఫీస్ వద్ద స్లో గా స్టార్ట్ అయిన ఈచిత్రం హిట్ టాక్ రావడంతో శుక్ర , శని వారాల్లో సూపర్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. దాంతో ఈచిత్రం రెండు రోజుల్లో అక్కడ $726,311 వసూళ్లను రాబట్టుకుంది. ఇక రేపటి తో ఈ చిత్రం 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.

నిజానికి నానికి ఓవర్సీస్ లో మంచి మర్కెట్ వుంది దానికి తోడు ఈ చిత్రానికి బ్లాక్ బ్లాస్టర్ టాక్ రావడంతో యూఎస్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటుతుంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :