ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “జిగర్ తండ డబుల్ ఎక్స్”.!

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “జిగర్ తండ డబుల్ ఎక్స్”.!

Published on Dec 8, 2023 7:06 AM IST

కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకులు మరియు ఇప్పుడు నటులుగా కూడా సాలీడ్ ట్రీట్ ఇస్తున్న ప్రముఖ నటులు రాఘవ లారెన్స్ మరియు ఎస్ జె సూర్య కాంబినేషన్లో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టార్ డ్రామా “జిగర్ తండ డబుల్ ఎక్స్” కోసం తెలిసిందే.

మొదటి పార్ట్ కి సీక్వెల్ గా తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్ లో మంచి హిట్ అయ్యింది. తెలుగులో కూడా రిలీజ్ అయ్యిన ఈ సినిమా అంతా రెస్పాన్స్ అయితే అందుకోలేదు. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇందులో పాన్ ఇండియా భాషల్లో ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఇప్పుడు చూడాలి అనుకునేవారు ట్రై చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు