త్వరలో టీవీ ప్రీమియర్ గా “జిగర్ తండ డబుల్ ఎక్స్”

త్వరలో టీవీ ప్రీమియర్ గా “జిగర్ తండ డబుల్ ఎక్స్”

Published on Jan 16, 2024 6:35 PM IST

రాఘవ లారెన్స్, ఎస్.జే. సూర్య ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జిగర్ తండ డబుల్ ఎక్స్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయింది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

త్వరలో జెమిని టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జిగర్ తండ డబుల్ ఎక్స్ ప్రసారం కానుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం టీవీ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు