‘చిక్కడు దొరకడు’గా సిద్దార్థ్

‘చిక్కడు దొరకడు’గా సిద్దార్థ్

Published on Jul 10, 2014 10:30 AM IST

Chikkadu-Dorakadu
లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న సిద్దార్థ్ చాలా రోజుల తర్వాత తను తమిళంలో చేసిన మరో సినిమాని తెలుగులో కూడా విడుదల చేయనున్నాడు. తమిళంలో ‘జిగర్తాండ’ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకి తెలుగులో ‘చిక్కడు దొరకడు’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ‘పిజ్జా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై అందరి ప్రశంశలు అందుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి డైరెక్టర్.

లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియోని త్వరలో తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి తెలుగులో వెన్నెలకంటి డైలాగ్స్ అందించనున్నాడు. ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమా తర్వాత సరైన హిట్ లేని సిద్దార్థ్ ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాతో సిద్దార్థ్ హిట్ అందుకుంటాడని మీరు ఫీలవుతున్నారా?

తాజా వార్తలు