యూత్‌ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందిన ‘జిగ్రీస్’ (Jigris) సినిమా యాక్టర్స్ లేదా టెక్నీషియన్స్ కంటే ఎక్కువగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సపోర్ట్‌తోనే ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. ట్రైలర్‌ను లాంచ్ చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకావడం ద్వారా వంగా ఈ చిత్రానికి బలమైన సపోర్ట్ అందించారు. కృష్ణ బురుగుల, మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్, మణి వాకా, ధీరజ్ ఆత్రేయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2025 నవంబర్ 14న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. సన్ నెక్స్ట్ వేదికగా జనవరి 6 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో సాధించిన రెస్పాన్స్‌తో పోలిస్తే, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ సినిమాకు మెరుగైన ఆదరణ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
‘జిగ్రీస్’ (Jigris) చిత్రంతో హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి ఈ సినిమాను నిర్మించారు. సయీద్ కమ్రాన్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా, ఓటీటీ విడుదలతో ఈ చిత్రానికి కొత్త ఊపిరి లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.


