
2014లో తమిళనాట విడుదలై మంచి విజయం సాధించిన జిల్లా చిత్రం ఇప్పుడు అదే పేరుతొ తెలుగులోకి అనువాదంకానుంది. విజయ్, కాజల్ ప్రధానపాత్రధారులు. మలయాళ నటుడు మోహన్ లాల్ ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సినిమాను తెలుగులో తిరిగి తెరకెక్కించే ప్రయత్నం చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ చిత్రంలో విజయ్ సరసన కాజల్ నటించింది.
ఈ సినిమా అనువాద వెర్షన్ ఈ నెల 24న మన ముందుకు రానుంది. బ్రహ్మానందం, ఎల్.బయో శ్రీరామ్ ఈ వెర్షన్ లో అలరించనున్నారు. ఆర్.బి చౌదరి సమర్పకుడు. కుమార్ రెడ్డి నిర్మాత.

