సమీక్ష : జోరుగా హుషారుగా – నెమ్మదిగా సాగె రొటీన్ లవ్ స్టోరీ

సమీక్ష : జోరుగా హుషారుగా – నెమ్మదిగా సాగె రొటీన్ లవ్ స్టోరీ

Published on Dec 16, 2023 12:00 AM IST
Jorugaa Husharugaa Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సోను ఠాకూర్, సిరి హనుమంతు, మధునందన్, సాయి కుమార్, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు.

దర్శకుడు : అను ప్రసాద్

నిర్మాతలు: నిరీష్ తిరువీధుల

సంగీతం: ప్రణీత్ మ్యూజిక్

సినిమాటోగ్రఫీ: మహి రెడ్డి పండుగుల

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ జంటగా నటించిన తాజా సినిమా జోరుగా హుషారుగా. నేడు మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి సమీక్షలో చూద్దాం.

 

కథ :

సంతోష్ (విరాజ్ అశ్విన్) హైదరాబాద్‌లోని ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉండే వ్యక్తి. అతని స్నేహితురాలు, నిత్య (పూజిత పొన్నాడ), ఆఫీసులో అతని టీమ్ లో చేరి అనంతరం టీమ్ లీడర్‌ గా మారి అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. దానితో సంతోష్ బాస్ అయిన ఆనంద్ (మధునందన్) నిత్యను ఇష్టపడటం ప్రారంభించిస్తాడు, అక్కడి నుండి పరిస్థితులు క్లిష్టంగా మారతాయి. ఇది సంతోష్‌ని బాధిస్తుంది. కాగా మరోవైపు అతను తన తండ్రి యొక్క అప్పుని తీర్చాల్సి ఉంటుంది. మరి ఇంతకీ సంతోష్ తన ప్రేమని మరియు అప్పు సమస్యలను పరిష్కరించుకున్నాడా, ఆపైన ఏమి జరిగింది, అతడి జీవితం ఎలా సాగింది అనేది పూర్తిగా సినిమాలో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

బేబీ తర్వాత విరాజ్ అశ్విన్ ఈ మూవీలో మరొకసారి ప్రేమికుడి పాత్రలో కనిపిస్తాడు. అతడు తన పాత్రలో ఒదిగిపోయి యాక్టింగ్ చేయడంతో పాటు ఆకట్టుకునే డ్యాన్స్ లతో కూడా అలరించాడు. పూజిత పొన్నాడ, తన కూల్ మరియు బబ్లీ పర్సనాలిటీతో స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించడమే కాకుండా మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌ని కూడా ప్రదర్శిస్తుంది. విరాజ్ అశ్విన్‌తో ఆమె కెమిస్ట్రీ మూవీకి బాగా ప్లస్ అవుతుంది. మధునందన్ మరియు రాజేష్ ఖన్నా తమ పాత్రలలో మంచి నటనను ప్రదర్శించారు, అలానే కామెడీ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నారు. విరాజ్ అశ్విన్‌తో మధునందన్ చేసిన హాస్య సన్నివేశాలు మంచి నవ్వులు పూయిస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

అయితే ఈ మూవీలో విరామానికి ముందే స్టోరీ యొక్క ప్లాట్ ఊహాజనితంగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ, సెకండ్ హాఫ్ నెమ్మదించిన వేగంతో నిరుత్సాహపరుస్తుంది, మరింత ఆకర్షణీయమైన కథనం రాసుకుని ఉంటె బాగుండేదనిపిస్తుంది. రచయిత మరియు దర్శకుడు అను ప్రసాద్ ఈ విషయమై మరింత శ్రద్ధ కనబరచాల్సింది. సాయి కుమార్ మరియు రోహిణి మొల్లేటిల ప్రతిభను మరింత ఉపయోగించుకోవాల్సింది. ఎందుకంటే వారి పాత్రలు సినిమాపై పరిమిత ప్రభావాన్ని మాత్రమే చూపుతాయి. తండ్రి (సాయి కుమార్) మరియు కొడుకు (విరాజ్) మధ్య ఎమోషనల్ కనెక్షన్ సన్నివేశాలకు మరింత లోతు అవసరం. వారి మధ్య ప్రభావవంతమైన సన్నివేశాలను రూపొందించి వారి పాత్రల యొక్క భావోద్వేగాలని ఆడియన్స్ కి మరింతగా కనెక్ట్ చేసి ఉండాల్సింది.

 

సాంకేతిక విభాగం :

రచయితగా మరియు దర్శకుడిగా, అను ప్రసాద్ దర్శకత్వ ప్రతిభని బాగానే ప్రదర్శించినప్పటికీ, కొంత ఫోర్స్డ్ గా ఉండే ప్రేమ సన్నివేశాలు అవసరమైన భావోద్వేగాలని ఆడియన్స్ కి కనెక్ట్ చేయవు. సంగీత దర్శకుడు ప్రణీత్ మ్యూజిక్ ఓకే స్కోర్ అందించగా, సినిమాటోగ్రాఫర్ మహిరెడ్డి విజువల్స్ కి రిచ్‌నెస్ ని జోడించారు. ఎడిటింగ్ పర్వాలేదు కానీ ముఖ్యంగా చివరి భాగంలో మరింత మెరుగుగా వ్యవహరించాల్సింది.

 

తీర్పు :

మొత్తం మీద జోరుగా హుషారుగా సరైన ఎగ్జిక్యూషన్ లేని లవ్ డ్రామా మూవీ. ఈ మూవీలో మంచి హాస్యం మరియు ప్రధాన పాత్రల నుండి ఆమోదయోగ్యమైన నటన బాగున్నాయి. ముఖ్యంగా విరాజ్ అశ్విన్ నటన మరింతగా ఆకట్టుకుంటుంది. అయితే ఊహించదగిన సన్నివేశాలు, భావోద్వేగంలో లోతు లోపించడం వంటివి దీనికి ప్రతికూల అంశాలుగా చెప్పాలి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు