“గేమ్ చేంజర్” ప్లాన్ లోనే “దేవర” ట్రీట్ కూడా?

“గేమ్ చేంజర్” ప్లాన్ లోనే “దేవర” ట్రీట్ కూడా?

Published on Apr 24, 2024 7:10 PM IST

RRR హీరోలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” ఒకటి కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సినిమానే “గేమ్ చేంజర్”. RRR తర్వాత వారి నుంచి వస్తున్నా ఈ రెండు సినిమాలపై భారీ హైప్ నెలకొనగా దేవర ని రెండు భాగాలుగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్స్ లో సంగీత దర్శకుడు అనిరుద్ (Anirudh) కూడా ఒకడు. మరి సినిమా అనౌన్సమెంట్ అప్పుడే ఓ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వేరే లెవెల్ హైప్ ని తెచ్చి పెట్టిన తను రీసెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ లో కూడా దుమ్ము లేపేసాడు. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ లో ఆల్బమ్ పై ఓ ఊహించని స్థాయి అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇది ఎప్పుడో రావాల్సిందే కానీ పలు కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఇక దీనికి సమయం ఆసన్నం అయినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ఈ మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కానుకగానే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. లాస్ట్ టైం గేమ్ చేంజర్ కి కూడా ఎప్పుడో రావాల్సిన ఫస్ట్ సాంగ్ ని మేకర్స్ లాస్ట్ చేసి రామ్ చరణ్ పుట్టినరోజుకే రిలీజ్ చేశారు. దీనితో ఇప్పుడు దేవర ఫస్ట్ సాంగ్ కూడా ఇదే ప్లాన్ లో రానున్నట్టుగా టాక్ మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు