తెలంగాణ హైకోర్ట్ లో జూ. ఎన్టీఆర్ కేసు.. వివరాలు ఇవే

తెలంగాణ హైకోర్ట్ లో జూ. ఎన్టీఆర్ కేసు.. వివరాలు ఇవే

Published on May 17, 2024 1:02 PM IST


మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు భారీ చిత్రం “దేవర” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సినిమాలతో పాటుగా ఎన్టీఆర్ తన విలువైన సమయాన్ని కుటుంబంతో కూడా గడుపుతూ ఉంటాడు. అలా తనకి హైదరాబాద్ లో సొంత నివాసం ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు తన ఇళ్ళు, స్థలం విషయంలో కోర్టును ఆశ్రయించడం వైరల్ గా మారింది.

తారక్ గత రెండు దశాబ్దాల కితం 2003 లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 681 చదరపు యార్డులని సుంకు గీతా లక్ష్మి దగ్గర కొనుగోలు చేసాడు. కానీ ఈ గడిచిన ఇన్నేళ్ళలో ఆమె తారక్ కొన్న అదే స్థలంపై పలు బ్యాంకులలో ఋణాలు తీసుకోని చెల్లించకపోవడంతో ఇప్పుడు ఆ బ్యాంకుల వారు డెబిట్ రికవర్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. దీనితో తనకి తెలియకుండానే తారక్ ఈ సమస్యలో పడాల్సి వచ్చింది.

ఈ క్రమంలో బ్యాంకుల వారికి ట్రిబ్యునల్ అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో, తాను తన స్థలం విషయంలో జరిగిన ఫ్రాడ్ తో తెలంగాణ హై కోర్ట్ ని ఎన్టీఆర్ ఆశ్రయించాడు. దీనితో వెకేషన్ బెంచ్ న్యాయ నిర్ణేతలు శ్రీనివాసరావు, సుజేయ్ పాల్ లు డెబిట్ రికవరీ అపీలెట్ ట్రిబ్యునల్ వారిని ముందు సంప్రదించాలిగా అని గుర్తు చేశారు.

అయితే దీనికి తారక్ తరపు న్యాయవాది డి ఆర్ టి ఆర్డర్ లో సాంకేతిక లోపం మూలాన తాము హై కోర్టుని సంప్రదించాల్సి వచ్చింది అని తెలిపారు. దీనితో తరువాతి హియరింగ్ జూన్ 3కి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకోపక్క గీత ఎన్టీఆర్ కి స్థలాన్ని అమ్మినపుడు అనేక బ్యాంకులలో ఉన్న ఋణాలు కోసం ఎలాంటి వివరాలు అందించలేదట. మొత్తానికి అయితే ఈ కేసు ఇప్పుడు చర్చకు దారి తీసింది. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు