“వార్ 2”, “దేవర” తో తారక్ బిజీ బిజీ.!

“వార్ 2”, “దేవర” తో తారక్ బిజీ బిజీ.!

Published on Apr 11, 2024 10:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా ఇప్పుడు తన లైనప్ ని ఓ రేంజ్ లో సెటప్ చేసుకుంటున్నాడు. తెలుగు సహా హిందీ సినిమాలు కూడా ఓకే చేస్తూ తన టాలెంట్ ని మరోసారి పాన్ ఇండియా ఆడియెన్స్ కి చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. మరి అలా ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో భారీ చిత్రం “దేవర” (Devara) చేస్తుండగా ఈ సినిమా తర్వాత బాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ “వార్ 2” (War 2) లో జాయిన్ కాబోతున్నాడు.

దీనితో భారీ హైప్ తన లైనప్ పై నెలకొనగా ఈ రెండు సినిమాపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీనితో ఈ ఏప్రిల్ 12 నుంచి వార్ 2 లో తాను జాయిన్ కానుండగా మళ్ళీ 5 రోజుల్లోనే దేవర షూట్ లో పాల్గొననున్నాడట. అలాగే దేవర కి కూడా సుమారు వారం రోజులు పాటు డేట్స్ ఇచ్చిన తారక్ వాటి తర్వాత వెంటనే వార్ 2 కి షిఫ్ట్ కానున్నాడు అని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇలా ఈ రెండు భారీ సినిమాలని బ్యాలన్స్ చేస్తూ తారక్ ఇప్పుడు బిజీ బిజీగా ఈ రానున్న కొన్ని రోజులు గడపనున్నాడు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు