అది ఆట కాదు వేట, అంటున్న ఎన్టీఆర్.

అది ఆట కాదు వేట, అంటున్న ఎన్టీఆర్.

Published on Jul 6, 2019 12:15 PM IST

ఐపీఎల్ స్ఫూర్తి తో మొదలైన ప్రో కబడ్డీ దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతుంది. ఈ టోర్నమెంట్ నెక్స్ట్ సీజన్ ఈ నెల 20నుండి గ్రాండ్ గా స్టార్ మా, అలాగే హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ సీజన్ ప్రచార వీడియోలో యంగ్ టైగర్ దుమ్ములేపుతున్నాడు.’కబడ్డీ ఆట కాదు వేట’ అంటూ తనదైన మార్కు పంచులతో ప్రో కబడ్డీకి ప్రచారం కల్పిస్తున్నారు. గత సీజన్ నుండి ఎన్టీఆర్ ప్రో కబడ్డీ తెలుగు వెర్షన్ కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చరణ్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ అనే భారీ పీరియాడిక్ మూవీలో నటిస్తున్న తారక్రా, దర్శకుడు రాజమౌళి అమెరికా వెళ్లడంతో ఒక వారం విరామం దొరికింది. త్వరలోనే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూలు లో తారక్ పాల్గొననున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు