తారక రామునికి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల నివాళులు.

Published on May 28, 2019 8:21 am IST

నేడు నందమూరి తారకరామారావు 97వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ లు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం 5.30గంటలకే ఎన్టీఆర్‌ ఘాట్‌కుచేరుకున్నజూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఎన్టీఆర్‌ సమాధి పై పూలుజల్లి నివాళులర్పించారు.

నవరస నట సార్వభౌమునిగా తెలుగు తెరపై ధ్రువతారగా వెలిగిన ఎన్టీఆర్, తరువాత తెలుగు దేశం పార్టీ స్థాపించి, అధికారం చేపట్టి ప్రజలకు సుపరిపాలన అందించి, దేశరాజకీయాలపై తన ముద్ర వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు.

సంబంధిత సమాచారం :

More