ఎన్టీఆర్-సుకుమార్‌ల సినిమా టైటిల్ ఇదేనా..!

ntr-and-sukumar
‘టెంపర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన తరువాతి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. సరికొత్త కథాంశాలు, మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో తెలుగులో టాప్ డైరెక్టర్‌‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న సుకుమార్, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ‘1 నేనొక్కడినే’ తర్వాత సుకుమార్ స్థాయి మరింత పెరిగింది. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా, సుకుమార్ అనితరసాధ్య ప్రతిభను మాత్రం చాటిచెప్పింది. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాని అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు ఓ మంచి టైటిల్ పెట్టడం విషయమై సినిమా యూనిట్ ఆలోచిస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమాకు ‘దండయాత్ర’ అనే పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చినా, అది నిజం కాదని తెలుస్తోంది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో తండ్రీ కొడుకుల బలమైన సెంటిమెంట్ పోర్షన్‌పైనే సినిమా కథ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆ రకంగా సినిమాకు ‘నాన్నకు ప్రేమతో..’ అన్న టైటిల్ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట.

త్వరలోనే ఈ టైటిల్ విషయమై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. ఇక ఏప్రిల్ 17న లండన్‌లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. స్టైలిష్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా మరో కొత్త గెటప్‌లో దర్శనమివ్వనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version