ఎన్టీఆర్ మరోసారి సప్రయిజ్ చేస్తారా ?

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వెండి తెర మీద అభిమానుల్ని విపరీతంగా అలరించిన ఎన్టీఆర్ బుల్లి తెర మీదకు కూడ సందడి చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయన మూలంగా బిగ్ బాస్ మొదటి సీజన్ కు విపరీతమైన రేటింగ్స్, ఆదరణ దక్కాయి. ఆ తర్వాతి సీజన్లకు కూడ ఆయనే హోస్ట్ అయితే బాగుంటుందని అభిమానులు, ప్రేక్షకులు భావించారు. కానీ సినిమాలతో బిజీగా ఉండటం వలన చేయలేకపోయారు.

అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నవార్తల మేరకు తారక్ త్వరలో ఒక టీవీ షోతో ప్రేక్షకులను పలకరిస్తారని తెలుస్తోంది. ఈ టీవీ షోను ప్రముఖ ఛానెల్ జెమిని టీవీ రూపొందించనుందట. ఒక భిన్నమైన కాన్సెప్ట్ తీసుకుని ఈ షో చేస్తున్నారట. మరి ఈ వార్త నిజమేనా, నిజమే అయితే టీవీ షో ఎలా ఉండబోతోంది అనేది చూడాలి. ఇకపోతే తారక్ ప్రజెంట్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది వేసవికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత కూడ త్రివిక్రమ్ లాంటి స్టార్ దర్శకులతో ఆయన సినిమాలు చేయనున్నారు.

Exit mobile version