ఇంట్రెస్టింగ్..జస్ట్ ఇంత రన్ టైం తోనే కమల్ థ్రిల్లర్ రీరిలీజ్

ఇంట్రెస్టింగ్..జస్ట్ ఇంత రన్ టైం తోనే కమల్ థ్రిల్లర్ రీరిలీజ్

Published on Dec 9, 2023 8:00 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ సహా కోలీవుడ్ లో కూడా స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “ఆళవందాన్” చిత్రం కూడా రీ రిలీజ్ కి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మరి తెలుగులో “అభయ్” పేరిట రిలీజ్ చేసిన ఈ సైకో థ్రిల్లర్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ చిత్రాలని సుమారు రెండు దశాబ్దాలు కితమే కమల్ టచ్ చేసి చూపించారు.

అయితే ఈ సినిమా ఇప్పుడు కేవలం తమిళ్ వెర్షన్ లోనే రిలీజ్ కి వస్తుండగా డాల్బీ అట్మాస్ 4కే వెర్షన్ లో దీనిని కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సినిమా అప్పటి వెర్షన్ కి ఇప్పటి వెర్షన్ కి చాలా తక్కువ నిడివితోనే రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. పాత వెర్షన్ 2 గంటల 22 నిమిషాలకి పైగా ఉంటే ఇప్పుడు రీ రిలీజ్ వెర్షన్ కేవలం 2 గంటలు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో సినిమాలో చాలా సీన్స్ తీసేసి రిలీజ్ చేసారని చెప్పాలి. మరి ఈ చిత్రం 1000 స్క్రీన్స్ కి పైగా రిలీజ్ కి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు