ట్రైలర్: జాక్ పాట్ – ఫన్నీ పోలీస్ ఆఫీసర్స్

ట్రైలర్: జాక్ పాట్ – ఫన్నీ పోలీస్ ఆఫీసర్స్

Published on Jul 27, 2019 3:52 PM IST

జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన “జాక్ పాట్” చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. పోలీస్ ఆఫీసర్ గా జ్యోతిక పెరఫార్మెన్సు అదిరిపోయింది. “జాక్ పాట్” ట్రైలర్ లో కామెడీ,యాక్షన్, డాన్స్ లతో జ్యోతిక అద్భుత నటన కనపరిచారు. సీనియర్ హీరోయిన్ రేవతి కూడా జ్యోతికతో సమానమైన పాత్ర చేస్తున్నట్లు సమాచారం. గతంలో జ్యోతిక “నాచ్చియార్” చిత్రం సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశారు. ఈ చిత్రంలో మాత్రం కొంచెం కామెడీగా సాగే పోలీస్ పాత్రలో జ్యోతిక నటించినట్లున్నారు.

ఆనంద్ రాజ్, కమెడియన్ యోగి బాబు నటిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది. తాజాగా జ్యోతిక “రాత్ససి” చిత్రంలో టీచర్ గా నటించారు. “రాత్ససి” చిత్రం లో ప్రభుత్వ విద్యావ్యవస్థ పై మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో సినిమా ఆపివేయాలని ఉపాధ్యాయులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు