హిందీలో మరికొన్ని చిత్రాలు చేయనున్న జ్యోతిక!

హిందీలో మరికొన్ని చిత్రాలు చేయనున్న జ్యోతిక!

Published on Feb 24, 2024 8:39 AM IST

షైతాన్ ట్రైలర్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ మరియు పెద్ద స్టార్స్, అజయ్ దేవగన్, మాధవన్ మరియు జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఇందులో అజయ్ దేవగన్ కి జ్యోతిక భార్య గా నటించింది. చాలా గ్యాప్ తర్వాత హిందీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆమె 90వ దశకం చివరిలో డోలీ సజా కే రక్నా చిత్రంతో తన అరంగేట్రం చేసిందని చాలామందికి తెలియదు.

ఇప్పుడు, ఆమె మరికొన్ని ప్రాజెక్ట్‌లకు కూడా సంతకం చేసిందని మరియు హిందీ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 8, 2024న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు