
గామా అవార్డులు (గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్) 2014లో ప్రారంభమైన విషయం తెలిసిందే. జనవరి 31 న జరిగిన గామ అవార్డ్స్ కార్యక్రమంలో 2013వ సంవత్సరానికి సంబంధించిన మ్యూజికల్ అవార్డ్స్ తో పాటు ఈ వేదికపై ప్రముఖ దర్శకులు బాపు గారికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. పలువురు ప్రముఖ కళాకారులు పాల్గొన్న ఈ వేడుక దుబాయ్ లోని ప్రవాసాంధ్రులను అలరించింది. ఈ వేదికపై పలువురు గాయనీ గాయకులు తమ ఆట, పాటలతో దుబాయ్ లోని తెలుగువారిని అలరించారు. మరో రెండు నెలల్లో 2014 ఏడాదికి సంబంధించిన గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్ (గామా) వేడుక జరగనుంది.
2014వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన ‘గామా అవార్డు’ల ప్రదానోత్సవం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న దుబాయ్ లో జరగనుంది. తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ ను ఈ వేదికపై జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నామని అవార్డు వేడుకల చైర్మన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు. గత వేడుకకన్నా ఈసారి మరింత వైభవంగా ఈ అవార్డుల వేడుకను జరపనున్నామని ఆయన చెప్పారు. పలువురు ప్రముఖ నటీనటులు, గాయనీ గాయకులు,సంగీత దర్శకులు, పాటల రచయితలు, కళాకారులు పాల్గొనబోతున్న ఈ వేడుక దుబాయ్ లోని తెలుగువారికి కనుల పండువ అవుతుందని కూడా త్రిమూర్తులు అన్నారు.మరిన్ని వివరాలకు www.gamaawards.com చూడవచ్చని తెలిపారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ కు గామా అవార్డ్స్ జీవిత సాఫల్య పురస్కారం
కళాతపస్వి కె.విశ్వనాథ్ కు గామా అవార్డ్స్ జీవిత సాఫల్య పురస్కారం
Published on Dec 26, 2014 8:00 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం జోష్ పంచే చిత్రాలివే !
- ‘ఆదర్శకుటుంబం’ కోసం ప్రత్యేక పాట ?
- ఎన్టీఆర్ కి విలన్ గా ఆ స్టార్ హీరో ?
- చరణ్ ‘పెద్ది’ విడుదల పరిస్థితేంటి ?
- Dacoit Business: బడ్జెట్ ఎంత? నాన్-థియేట్రికల్ డీల్స్ ఏంటి? బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తయిందా?
- ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరింది !
- ‘సింగర్’ పై కేసు వెనుక ఏం జరిగింది ?
- బాలయ్య సినిమా సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘రౌడీ జనార్దన’ ఇంటర్వెల్ కి సన్నాహాలు !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సంగీత ప్రపంచంలో మరో ధృవతార ఆశా బొంస్లే అస్తమయం.. సినీ ప్రముఖులు నివాళులు
- ఫైనల్ గా ‘కూలీ’ తెలుగు వెర్షన్ బుల్లితెరపైకి.. ఎప్పుడంటే!
- బాలయ్యతో మళ్లీ ఆ దర్శకుడు ?
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
- ‘ఓజి 2’ కి బిగ్ ఛేంజ్?
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ ?

