‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’: తగ్గేదేలే అంటున్న ‘కాకా’ యూనిట్.. మెగాస్టార్ సెటిల్ చేస్తారా?

‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’: తగ్గేదేలే అంటున్న ‘కాకా’ యూనిట్.. మెగాస్టార్ సెటిల్ చేస్తారా?

Published on Sep 12, 2026 3:32 PM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు కాకా అనే సాలిడ్ మాస్ అండ్ క్లాస్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న ఈ సినిమాని మేకర్స్ ఆల్రెడీ సంక్రాంతి రిలీజ్ కి ఖాయం చేశారు. కానీ ఈ గ్యాప్ లో మెగాస్టార్ గత చిత్రం విశ్వంభర కూడా సంక్రాంతి బరిలోనే వస్తుంది అనే టాక్ కూడా ఇప్పుడు ఊపందుకుంది.

ఇలా ఓటిటి డీల్ పూర్తయితే డేట్ అనౌన్స్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం. దీనితో కాకా వాయిదా పక్కా అని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడుకి కూడా కాకా యూనిట్ వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. నేడు బాబీపై చేసిన పోస్ట్ తో కూడా రిలీజ్ డేట్ ని జనవరి జనవరి 13 అని నొక్కి చెబుతున్నారు.

దీనితో వీరు కూడా వెనక్కి వెళ్ళేది లేదనే సూచిస్తున్నారు. దీనితో ఒకే రేస్ లో మెగాస్టార్ రెండు సినిమాల క్లాష్ ఉంటుందా అనే రీతిలో పరిస్థితి హీటెక్కుతోంది. అయితే దీనికి మాత్రం ఖచ్చితంగా మెగాస్టార్ నే ఒక పరిష్కారం చూపే ఆస్కారం ఉంది. సో ఈ ఆసక్తికర పరిస్థితి ఎలా సర్దుమణుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు