ఇంకా పూర్తికాని ‘కాలా’ సెన్సార్ !

ఇంకా పూర్తికాని ‘కాలా’ సెన్సార్ !

Published on Apr 3, 2018 3:48 PM IST

ఈ వేసవికి రానున్న భారీ చిత్రాల్లో సూపర్ స్టార్ రాజనీకాంత్ యొక్క ‘కాలా’ కూడ ఒకటి. ఈ చిత్రం ఈ నెల 27న విడుదలవ్వాల్సి ఉండగా తమిళనాట నడుస్తున్న థియేటర్ల బంద్ మూలాన వాయిదాపడేలా కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకున్నట్లు, సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీ చేసినట్టు వార్తలొచ్చాయి.

అలాగే సినిమాకు సెన్సార్ సమయంలో 10కి పైగా చిన్న చిన్న కట్స్ కూడ పడ్డాయని అన్నారు. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తమిల్ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి వీటిలో ఏది వాస్తవమో తెలియాలంటే లైకా సంస్థ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు ధనుష్ స్వయంగా నిర్మించగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చిత్రాన్ని విడుదలచేయనుంది. ముంబైలోని ధారావి అనే మురికివాడ నైపథ్యంలో నడిచే ఈ సినిమాలో రజనీ లోకల్ డాన్ పాత్రలో అలరించబోతున్నారు.

తాజా వార్తలు