మిలియన్ మార్కును అందుకున్న ‘కాలా’ !
Published on Jun 9, 2018 9:55 am IST

సూపర్ స్టార్ రజనీ నటించిన ‘కాలా’ చిత్రం తమిళనాట మంచి స్పందనను దక్కించుకుంటోంది. ఇప్పటీకే చెన్నైలో బ్రహ్మాండమైన వసూళ్లను రాబడుతోన్న ఈ చిత్రం ఓవర్సీస్లో కుడ ప్రేక్షాధారణ పొందుతోంది. 322 లొకేషనల్లో ప్రదర్శించిన ప్రీమియర్ల ద్వారా 509,502 డాలర్లను రాబట్టుకున్న ఈ చిత్రం ఆ తర్వాతి రెండు రోజుల్లో మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చి మిలియన్ మార్కును అందుకుంది.

ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు ఇప్పటి వరకు ఈ చిత్రం 1,019,988 డాలర్లను వసూలు చేసింది. ‘రోబో, లింగ, కబాలి’ చిత్రాల తర్వాత యూఎస్లో రజనీకిది నాల్గవ మిలియన్ డాలర్ చిత్రం. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook