‘కాలా’ రన్ టైమ్ ఎంతో తెలుసా
Published on May 18, 2018 5:00 pm IST

‘కబాలి’ చిత్రం ఊహించిన స్థాయిలో విజయం సాదించకపోయినా ఆ చిత్ర దర్శకుడు పా.రంజిత్ కు రెండో అవకాశమిస్తూ రజనీ చేసిన చిత్రం ‘కాలా’. ముంబైలోని ధారవి బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ చిత్రంలో రజనీ లోకల్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్ర రన్ టైమ్ 2 గంటల 45 నిముషాలుగా ఉంటుందని తెలుస్తోంది.

తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడ జూన్ 7వ తేదీన భారీ ఎత్తున విడుదలకానుంది ఈ చిత్రం. రూ.125 కోట్లకి చిత్ర హక్కుల్ని దక్కించుకున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనుంది. ధనుష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో నానా పటేకర్, హుమా ఖురేషి, ఈశ్వరి రావులు కీలక పాత్రల్లో నటించారు.

రజనీ తన రాజకీయ ఆరంగేట్రాన్ని ప్రకటించిన తర్వాత వస్తున్న తొలి చిత్రం కావడంతో దీనిపై తమిళ ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook