తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “కాటేరా”

తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “కాటేరా”

Published on Apr 14, 2024 2:50 PM IST

కన్నడ హీరో దర్శన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ తరుణ్ సుధీర్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కాటేరా. ఈ చిత్రం గతేడాది థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ముందుగా కన్నడ బాషలో స్ట్రీమింగ్ కి అందుబాటులో వచ్చిన సంగతి తెలిసిందే. జీ 5 లో ఈ చిత్రం కన్నడ బాషలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

తెలుగు వెర్షన్ నేటి నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం ను తెలుగు లో చూడటానికి ఎదురు చూసిన వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆరాధన రామ్, జగపతి బాబు, కుమార్ గోవింద్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వి. హరికృష్ణ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు