మణిరత్నం దర్శకత్వంలో రానున్న “కడల్” చిత్రం ప్రస్తుతం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 17న విడుదల అవ్వాల్సి ఉండగా రెండు రోజుల ముందే విడుదల చేశారు నిన్న ఈ చిత్ర పాటలను ఆపిల్ ఐ ట్యూన్స్ లో అప్లోడ్ చేశారు విడుదల అయిన కొద్ది నిమిషాలలోనే ఐ ట్యూన్స్ లో మొదటి స్థానానికి ఎగబాకింది. భారత దేశం మొత్తంలో ఈ చిత్ర పాటలు ఐ ట్యూన్స్ లో మొదటి స్థానంలో నిలవడం చిత్ర బృందానికి ఆశ్చర్యం కలిగించింది. ఈ చిత్ర తెలుగు ఆడియో కూడా మెల్లగా అంచనాలను పెంచుతుంది. ఈ మధ్యనే “నేంజికుల్లె” పాట తెలుగు వెర్షన్ “గుంజుకున్న” పాటను తెలుగులో విడుదల చేశారు. వనమాలీ ఈ పాటకు సాహిత్యం అందించారు. “కడలి” అనే పేరుతో తెలుగులోకి ఈ చిత్రం రానుంది. గౌతం మరియు తులసి ఈ చిత్రంతో తెరకు పరిచయం కానున్నారు. అరవింద్ స్వామి మరియు లక్ష్మి మంచు ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం జాలర్ల నేపధ్యంలో జరుగుతుంది. మణిరత్నం అభిమానులకి ఈ చిత్రం కన్నుల పండుగ కానుంది. 2013 జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది.
ఐ ట్యూన్స్ లో మొదటి స్థానంలో కడల్ ఆడియో
ఐ ట్యూన్స్ లో మొదటి స్థానంలో కడల్ ఆడియో
Published on Dec 15, 2012 2:19 PM IST
సంబంధిత సమాచారం
- తమిళ స్టార్ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- జపాన్‌లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- థియేటర్లలో మాస్ రాజా మాస్ ఎంటర్టైనర్ ‘మిరపకాయ్’.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!
- ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో.. క్యాస్టింగ్‌పై మిక్సిడ్ కామెంట్స్..!
- ‘ఇరుముడి’ హిట్టు బొమ్మ కావాలంటే ఎంత రాబట్టాలో తెలుసా?
- ఇంటర్వ్యూ : సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ – ‘ఇరుముడి’ ట్రెండ్ సెట్టర్ అవుతుంది..!
- సూర్య నెక్స్ట్ మూవీలో అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?
- ఉదయ్ కిరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. గ్రాండ్‌గా ‘నీ స్నేహం’ రీ-రిలీజ్!
- ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో సూర్య దీపావళి సినిమా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్‌టైమ్ డీటెయిల్స్!
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- రూ.లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు: చెత్త సినిమా అంటూ ట్రోలింగ్.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం!
- సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ఎన్టీఆర్‌తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు మరో క్రేజీ టైటిల్..?
- మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!
- మళ్లీ సందడి చేయబోతున్న ఎవర్గ్రీన్ రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’


