ఆసక్తిని క్రియేట్ చేస్తున్న విక్రమ్ లుక్ !

ఆసక్తిని క్రియేట్ చేస్తున్న విక్రమ్ లుక్ !

Published on Nov 7, 2018 5:20 PM IST

వరుస పరాజయాలతో కొనసాగుతున్న సీనియర్ తమిళ హీరో చియాన్ విక్రమ్ ఇటీవల ‘సామీ స్క్వేర్’ చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఈచిత్రం కూడా ఆయనకు విజయాన్ని అందించలేకపోయింది. ఇక తాజాగా ఆయన రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో ‘కదరం కొండన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నిన్న విడుదలైన ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. హాలీవుడ్ హీరో లుక్ లో ఉన్న విక్రమ్ గెటప్ సినిమా ఫై అంచనాలు పెంచేసింది.

హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘డోంట్ బ్రీత్’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కుతున్న ఈచిత్రంలో అక్షరా హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు కమల్ హాసన్ హోమ్ బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు