ఆకట్టుకుంటున్న విక్రమ్ కొత్త సినిమా టీజర్ !

ఆకట్టుకుంటున్న విక్రమ్ కొత్త సినిమా టీజర్ !

Published on Jan 15, 2019 3:29 PM IST

గత కొంత కాలంగా వరుస పరాజయాలతో కొనసాగుతున్న స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘కదరం కొండన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘డోంట్ బ్రీత్’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజేష్ ఎమ్ సెల్వ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

కాగా తాజాగా చిత్రబృందం ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసింది. టీజర్ లో విక్రమ్ న్యూ లుక్ లో చాలా స్టైలిష్ గా వున్నాడు. ఈ టీజర్ విక్రమ్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

అక్షరా హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు కమల్ హాసన్ హోమ్ బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు