పాన్-గ్లోబల్ చిత్రంగా ‘ఖైగల్’: ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

పాన్-గ్లోబల్ చిత్రంగా ‘ఖైగల్’: ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Published on Mar 19, 2026 9:00 PM IST

Untitled 29

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పాన్-గ్లోబల్ చిత్రం ‘ఖైగల్’ బృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. జై సిద్ధార్థ్ ‘దేవ’ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అగ్ని, గందరగోళం మధ్య రక్తసిక్తమైన యోధుడిగా తిరుగుబాటును సూచిస్తూ డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

యశ్‌విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుష్మిత సింగ్ (సతీ), వాంశీ ఉదయ్ (నందిని) కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.ఆర్ ప్రొడక్షన్స్, ఖైగల్ వారియర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి గీతా రమేష్, అక్షర జి.ఆర్, సంతోష్ అబ్రహం నిర్మాతలు. దేవా పాత్రకు జై సిద్ధార్థ్ కటౌట్, ఆయన ప్రత్యేకమైన బేస్ వాయిస్ పర్ఫెక్ట్‌గా సరిపోయాయని, ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందని దర్శకుడు యశ్‌విన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి ప్రియేష్ మోతుకూరి సంగీతం, దేవ్ దీప్ కుండు సినిమాటోగ్రఫీ, యోగానంద డిసి యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘ఖైగల్’ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, స్పానిష్, జర్మన్ సహా మొత్తం 13 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు