కల్కి మూవీ కోసం ఎదురు చూస్తున్నా – కాజల్ అగర్వాల్!

కల్కి మూవీ కోసం ఎదురు చూస్తున్నా – కాజల్ అగర్వాల్!

Published on May 30, 2024 10:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏ. డి (Kalki2898 AD) జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. అయితే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా కల్కి 2898AD మూవీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

జూన్ 7 వ తేదీన కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ చిత్రం రిలీజ్ కి రెడీ అయిపోయింది. రిలీజ్ కి రెడీ అవ్వడంతో, సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. ప్రభాస్ ది, కాజల్ అగర్వాల్ ది బెస్ట్ పెయిర్. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నారు. ఒకే నెలలో సత్యభామ, కల్కి చిత్రాలు రిలీజ్ అవుతుండటం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు అని అడగగా, ఎంతో ఎగ్జైట్ అవుతున్నట్లు తెలిపారు.

ఒక నటిగా సత్యభామ చిత్రం విషయం లో ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అందరి అభిమానులు లాగానే, కల్కి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ప్రచార చిత్రాలు అన్నీ ఆకట్టుకున్నాయి అని, సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకునే, దిశా పటాని లు ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు