ఐటెం గర్ల్ గా మారిన కాజల్ అగర్వాల్

kajal-aggarwalకాజల్ అగర్వాల్ ఐటెంగర్ల్ జాబితాలో చేరింది. ‘గీతాంజలి’ చిత్రం లో కాజల్ ఐటెం సాంగ్ చేయనుంది. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ మరియు ఎ. వి. వి. సత్యనారాయణ నిర్మిస్తున్నారు .

ఈ చిత్రం హారర్ కామెడీ గా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ లో రిలీజ్ చేయడానికి సన్నాహం చేస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ ఈ నెలలో జరగనుంది.

ఇప్పుడు ఐటెం సాంగ్స్ చేస్తున్న శృతి, తమన్నాల సరసన కాజల్ కూడా చేరనుంది. ప్రస్తుతం హీరోయిన్లు ఐటెం సాంగ్ చేయడం ట్రెండ్ కాగా ఈ ఐటెం గర్ల్ ల జాబితాలో ఇంకెవరు చేరతారో వేచి చూడాలి.

Exit mobile version