ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ కి రెడీ అయిన కాజల్ అగర్వాల్ “సత్యభామ”

ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ కి రెడీ అయిన కాజల్ అగర్వాల్ “సత్యభామ”

Published on Apr 21, 2024 9:25 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సత్యభామ. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి మేకర్స్ తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేసారు.

రేపు సాయంత్రం 4:05 గంటలకు ఈ చిత్రం కి సంబందించిన అనౌన్స్ మెంట్ ఉండనుంది. అయితే ఇది రిలీజ్ డేట్ అయ్యే అవకాశం ఉంది. మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇస్తారు అనే దానిపై రేపు క్లారిటీ రానుంది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర అమరేందర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో నవీన్ చంద్ర పర్ ఫార్మెన్స్ టెర్రఫిక్ గా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరొక కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు